తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తూర్పు భారతంలో మోదీ ఎన్నికల శంఖారావం - ODISHA

తూర్పు భారతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. ఒడిశా కోరాపుట్ జిల్లా జేపూర్​ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

తూర్పు భారతంలో మోదీ ఎన్నికల శంఖారావం

By

Published : Mar 29, 2019, 7:24 AM IST

నేడు ఒడిశాలో మోదీ పర్యటన
తూర్పు భారతదేశంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. మొదటగా ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తారు ప్రధాని. కోరాపుట్​ జిల్లా జేపూర్​ పట్టణంలో భాజపా నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మరోమారు ఏప్రిల్​ 2న భవానిపట్నాలో సభకు హాజరవుతారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి గోలక్ మొహాపాత్ర తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మోదీ వివరిస్తారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఏప్రిల్​ 1న పర్లఖేముండి, ఉమర్​కోట్ బహిరంగ సభలకు హాజరవనున్నారు.

ABOUT THE AUTHOR

...view details