తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సొంత కేడర్​కు ఇద్దరు సీబీఐ అధికారుల బదిలీ - సీబీఐ

ఇద్దరు సీబీఐ అధికారుల్ని బదిలీ చేసిన కేంద్రం. మరో ఇద్దరికి పదోన్నతి

SDFS

By

Published : Feb 7, 2019, 9:21 AM IST

Updated : Feb 7, 2019, 9:27 AM IST

సీబీఐ సీనియర్​ అధికారులు అనీశ్​ ప్రసాద్, అభయ్​సింగ్​ల పదవీకాలం ఉండగానే బదిలీ చేసింది అంతర్గత వ్యవహారాల శాఖ. 2003 బ్యాచ్​ త్రిపుర క్యాడర్​కు చెందిన ఐపీఎస్​ అధికారి అనీశ్​ ప్రసాద్​ను తిరిగి రాష్ట్ర సర్వీస్​కు పంపించింది. 2003 మధ్యప్రదేశ్​ క్యాడర్​కు చెందిన ఐపీఎస్​ అధికారి అభయ్​సింగ్​ను రాంచీకి బదిలీ చేసింది.

ప్రస్తుతం సీబీఐ పాలనా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్​గా పనిచేస్తున్న అనీశ్​ ప్రసాద్ సీబీఐ మాజీ డైరెక్టర్​ ఆలోక్​వర్మ, రాకేశ్​​ అస్థానా వివాదం నడిచేటప్పుడు కీలకమైన ​సీబీఐ నిఘా విభాగంలో పనిచేశారు.

మరో ఇద్దరు అధికారులకు పదోన్నతి...

బొగ్గు కుంభకోణం దర్యాప్తు చేసిన ప్రవీణ్ సిన్హాకు జాయింట్​ డైరెక్టర్​గా పదోన్నతి కల్పించారు. సిన్హా 1988 బ్యాచ్​కు చెందిన గుజరాత్ ఐపీఎస్ అధికారి. డిప్యూటీ ఇన్​స్పెక్టర్ జనరల్​గా పనిచేస్తున్న అమిత్​కుమార్​కు జాయింట్​ డైరెక్టర్​గా పదోన్నతి కల్పించారు. అమిత్​ 1988 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్​ అధికారి.

Last Updated : Feb 7, 2019, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details