సల్మాన్ ఖాన్.. అల్లరి పోలీసుగా మూడోసారి కనిపిస్తున్న సినిమా 'దబాంగ్ 3'. ఇటీవలే మధ్యప్రదేశ్లో షూటింగ్ మొదలైంది. తాజాగా హీరోయిన్ సోనాక్షి సిన్హా చిత్రీకరణలో పాల్గొంది. సంబంధిత ఫొటోను ట్వీట్ చేసిందీ భామ.
రాజో మళ్లీ వచ్చేసింది. దబాంగ్ నుంచి దబాంగ్ 3 వరకు. సొంత ఇంటికి వచ్చినట్లుంది. నన్ను ఆశీర్వదించండి -సోనాక్షి సిన్హా, హీరోయిన్