తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఒక సంవత్సరంలో ఆరు సినిమాలు నిర్మిస్తున్నాడు - ఆనంద్ ఎల్ రాయ్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్.. ఒకే ఏడాది ఆరు సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అన్నీ విభిన్న జానర్లలో ఉండనున్నాయని సమాచారం.

ఒకే ఏడాదిలో ఆరు సినిమాలు నిర్మిస్తున్న ఆనంద్ ఎల్ రాయ్

By

Published : Mar 26, 2019, 6:15 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ సంవత్సరం తన సంస్థ నుంచి ఆరు కొత్త చిత్రాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌పై ఈ కొత్త సినిమాలను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఒక్కో సినిమా ఒక్కోరకంగా ఉండనుందని సమాచారం.

‘స్ట్రేంజర్స్‌’, ‘తను వెడ్స్‌ మను’, రాన్జాన్హా’ ‘తను వెడ్స్‌ మను: రిటర్న్స్ ' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు రాయ్​.

‘హ్యాపీ బాగ్‌ జాయేగి’, ‘శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌’, ‘మేరీ నిమ్మో’, ‘మన్మర్జియన్‌’లను నిర్మించారు.

2017వ సంవత్సరంలో ఎరోస్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి నిర్మించిన ‘న్యూటన్‌’ చిత్రం ఆ ఏడాది భారతదేశం నుంచి ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details