తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మహర్షి సెట్లో కూతురుతో సరదాగా కాసేపు - మహర్షి సినిమా సెట్స్

శరవేగంగా చిత్రీకరణ​ జరుపుకుంటున్న మహర్షి సెట్లో 'సితార' సందడి చేసింది. ఆ ఫొటోలను ట్విట్టర్​లో పంచుకున్నాడు మహేశ్​ బాబు.

కూతురు సితారతో మహేశ్​బాబు ముచ్చట్లు

By

Published : Mar 30, 2019, 8:59 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. ముద్దుగా సీతాపాప అని పిలుస్తుంటాడు. అతడు ప్రస్తుతం నటిస్తున్న ‘మహర్షి’ సెట్లో ఈ చిన్నారి సందడి చేసింది. షూటింగ్‌ విరామంలో ఈ తండ్రీకూతుళ్లు కాసేపు సరదాగా ముచ్చట్లాడుకున్నారు. ఆ ఫోటోలను ట్విట్టర్​లో పోస్టు చేశాడు మహేశ్​ బాబు. అవి ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

కూతురు సితారతో మహేశ్​బాబు ముచ్చట్లు

ఇటీవలే బాహుబలి, శ్రీమంతుడు సినిమాల్లోని పాటలకు డ్యాన్స్​ చేసి అదరగొట్టింది సితార.

కూతురు సితారతో మహేశ్​బాబు ముచ్చట్లు

ఇప్పటికే విడుదలైన మహర్షి తొలి పాట 'చోటీ చోటీ బాతే' సంగీత ప్రియలను ఆకట్టుకుంటోంది. అల్లరి నరేశ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details