తెలంగాణ

telangana

ETV Bharat / briefs

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ రంజన్​ గొగోయి - ranjan gogoi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

shriivaarini-drshincukunn

By

Published : Apr 19, 2019, 12:12 PM IST

Updated : Apr 19, 2019, 1:24 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు ప్రధాన న్యాయమూర్తిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.

పెరిగిన రద్దీ

వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేరు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న శ్రీవారిని 63 వేల 548 దర్శించుకున్నారు. 27 వేల 290 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 89 లక్షలు

శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగోయి

ఇదీ చదవండి

సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట

Last Updated : Apr 19, 2019, 1:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details