టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఓ బేబీ". కొరియన్ చిత్రం "మిస్ గ్రానీ"కి రీమేక్‌గా రూపొందింది. ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. యువతి, మధ్య వయసు స్త్రీ, వృద్ధురాలిగా మూడు విభిన్న పాత్రల్లో సమంత కనిపించనుంది.
"ఓ బేబీ" షూటింగ్ పూర్తైంది - నందిని రెడ్డి
సమంత హీరోయిన్గా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న "ఓ బేబీ" షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫోటోను ట్విట్టర్లో పంచుకుంది చిత్ర బృందం.
షూటింగ్ పూర్తి చేసుకున్న "ఓ బేబీ"
అలా మొదలైంది, కల్యాణ వైభోగమే సినిమాలతో ఆకట్టుకున్న నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. కథానాయిక తండ్రిగా రావు రమేశ్ కనిపించనున్నాడు. పూర్తి హీరోయిన్ ఓరియెంటడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది.