తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా! - అమిత్​ షా

అసంతృప్త భాజపా ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 28న సిన్హా తమ పార్టీలోకి వస్తారని ప్రకటించారు బిహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​, ఎంపీ అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్. ​

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా?

By

Published : Mar 26, 2019, 10:55 PM IST

Updated : Mar 26, 2019, 11:44 PM IST

కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్న శత్రుఘ్న సిన్హా?
బాలీవుడ్​ నటుడు, అసంతృప్త భాజపా నేతశత్రుఘ్న సిన్హా ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరతారని బిహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​, రాజ్యసభ సభ్యుడు అఖిలేశ్ ప్రసాద్​ సింగ్​ ప్రకటించారు.

"శత్రుఘ్న సిన్హా దిల్లీలో ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్​ పార్టీలో చేరుతారు. ఆయన పట్నా సాహెబ్ లోక్​సభ స్థానం​ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతారు."- అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​, బిహార్​ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ సమక్షంలో సిన్హా చేరే విషయంపై స్పష్టతనివ్వలేదు అఖిలేశ్​. ప్రముఖ నాయకుల సమక్షంలో శత్రుఘ్న పార్టీలోకి వస్తారని తెలిపారు. బిహార్​లో కాంగ్రెస్​, ఆర్​జేడీ కూటమి ఎన్నికల బరిలో నిలిచింది.

భాజపా ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా కొంతకాలంగా సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షా విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పట్నా సాహెబ్​ టికెట్​ను సిన్హాకు ఇవ్వలేదు భాజపా. ఆ స్థానంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ను బరిలోకి దింపింది.

ఇదీ చూడండి :నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

Last Updated : Mar 26, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details