స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది. 180 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు నోటీస్ ఇవ్వగా.. ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 179 జడ్పీటీసీ, 1850 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి మినహా మిగతా జిల్లాల్లో రెండోదశ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడత అనుభవాల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
తెలంగాణలో రేపే రెండో విడత స్థానిక సమరం
స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. హైదారాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. మెుదటి విడత అనుభవాల నేపథ్యంలో అధికారులు అంతటా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.
తెలంగాణలో రేపే రెండో విడత స్థానిక సమరం
TAGGED:
second phase