తెలంగాణ

telangana

ETV Bharat / briefs

శారదా కుంభకోణం కేసులో అత్యంత తీవ్ర అంశాలు : సుప్రీం - rajeevkumar

శారదా కుంభకోణం కేసులో సీబీఐ సమర్పించిన నివేదికలో  అత్యంత తీవ్ర అంశాలున్నాయని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.

శారదా కుంభకోణంలో సుప్రీం వ్యాఖ్యలు

By

Published : Mar 27, 2019, 12:08 AM IST

శారదా కుంభకోణంపై సీబీఐ తాజాగా సమర్పించిన నివేదికలో అత్యంత తీవ్ర అంశాలు ఉన్నాయని పేర్కొంది సుప్రీంకోర్టు. కోల్​కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్​కుమార్​ను ఇటీవల ప్రశ్నించిన సీబీఐ తాజా నివేదికను సుప్రీంకు సమర్పించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం శారదా కేసు విచారణ చేపట్టింది. అత్యంత తీవ్ర అంశాలు కేసుతో ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. పోంజి కుంభకోణాన్ని విచారించిన ప్రత్యేక విచారణ బృందానికి నాయకత్వం వహించిన రాజీవ్ కుమార్​పై ఉన్న అభియోగాలపై నివేదిక సమర్పించాలని కోరింది. 10 రోజుల గడువు విధించింది.

సీబీఐ ప్రస్తుతం సమర్పించిన నివేదిక సీల్డ్​ కవర్​లో ఉన్నందున దాన్ని అనుసరించి తక్షణం ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పశ్చిమ బంగాల్​ అధికారులు విచారణకు సహకరించట్లేదని సీబీఐ సుప్రీంకు విన్నవించింది. రాష్ట్ర డీజీపీతో పాటు మాజీ పోలీస్ కమిషనర్​ రాజీవ్​కుమార్ విచారణకు సహకరించట్లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాల్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details