తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడు తెరుచుకోనున్న శబరిమల.... - అర్చకులు

ప్రత్యేక మాస పూజల నిమిత్తం శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. శాంతి భద్రతల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

నేడు తెరుచుకోనున్న శబరిమల....

By

Published : Feb 12, 2019, 6:38 AM IST

Updated : Feb 12, 2019, 10:56 AM IST

నేడు తెరుచుకోనున్న శబరిమల....
తీవ్ర ఉద్రిక్తతల నడుమ నేడు శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. నెలవారీ ఆరాధనల కోసం నేటి నుంచి 5 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యుక్త వయస్కులైన మహిళల ఆలయ ప్రవేశంపై ఇటీవల నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఆలయం తెరుచుకోనుండటంతో ఉత్కంఠ నెలకొంది.

మలయాళ మాసం 'కుంబం' సందర్భంగా ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు అధికారులు. కలభాభిషేకం(గంధంతో అభిషేకం), సహస్రకలశం, లక్షార్చన తదితర పూజలు నిర్వహించనున్నారు.

భద్రత నడుమ...

10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళల ఆలయ ప్రవేశంపై గతంలో భక్తుల నుంచి తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీలక్కల్​ బేస్​క్యాంప్​ వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించారు. భక్తుల్నీ, మీడియాను ఉదయం 10 గంటల తర్వాతే నీలక్కల్​ నుంచి పంబకు వెళ్లేందుకు అనుమతించనున్నారు.

అన్ని వయస్కుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్​ 28న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అనంతరం వరుసగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహిళల ఆలయ ప్రవేశంపై ఆందోళనకారులు నిరసనలు చేశారు.

Last Updated : Feb 12, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details