యాసంగి పంటలకు గాను రైతుబంధు సాయం చేరని రైతులకు కొద్ది రోజుల్లో చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు తొలివిడతగా దాదాపు 44 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. మరో ఏడు లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా పలు కారణాలతో నిలిచిపోయింది. వారికి ఇప్పుడు పంపిణీ చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారు 800 కోట్లను ఈ వారంలోపు అందించే దిశగా రంగం సిద్ధమవుతోంది.
వారంలోపు రెండోవిడత రైతుబంధు..! - formers
మార్చి 31తోనే యాసంగి కాలం ముగిసినప్పటికీ... సాయం అందని రైతులకు శుభవార్త.. వారంలో వారికి రైతుబంధు సాయం అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సాయం అందని రైతులకు శుభవార్త