తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రఫేల్​ ఒప్పందంలో పీఎంఓ హస్తం ఉంది: రాహుల్​

రఫేల్​ ఒప్పందంపై ప్రధాని కార్యాలయం, ఫ్రాన్స్​ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపిందని రాహుల్​ గాంధీ ఆరోపించారు.

రఫేల్ ఒప్పందంలో పీఎంఓ హస్తం

By

Published : Feb 8, 2019, 10:02 PM IST

రఫేల్​ ఒప్పందంలో పీఎంఓ హస్తముందన్న రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రఫేల్​ ఒప్పందంలో ప్రధాని కార్యాలయమే నేరుగా ఫ్రాన్స్​ ప్రభుత్వంతో చర్చలు జరిపిందన్నారు. ఈ కుంభకోణంలో మోదీ ప్రధాన నిందితుడని ఆరోపించారు.

రఫేల్​ కుంభకోణం తెరిచి మూసేసిన కేసుగా రాహుల్ అభివర్ణించారు. రఫేల్​ ఒప్పందంపై భారత్​, ఫ్రాన్స్ మధ్య చర్చల సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలు జరుపడంపై రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఓ పత్రిక కథనం ప్రచురించింది. దానిపై స్పందిస్తూ రాహుల్ మరోసారి రఫేల్ విమర్శలు చేశారు.

" ఈ దేశంలోని ప్రతి ఒక్క సైనికుడితో నేను మాట్లాడాలనుకుంటున్నా. మీకు చెందిన డబ్బును ప్రధానమంత్రి దొంగతనం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒప్పందాన్ని తప్పుతోవపట్టించి ఆయన స్నేహితుడు అనిల్​ అంబానీకి రూ.30 వేల కోట్లను దోచి పెట్టారు. ఫ్రాన్స్​ ప్రభుత్వంతో రక్షణ శాఖ, భారత సంధానకర్తల బృందం చేపట్టిన చర్చలను బలహీనపరుస్తూ ప్రధాని కార్యాలయం సమాంతర చర్చలు చేపట్టిందని రక్షణ శాఖ స్పష్టంగా తెలిపింది. "- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

రఫేల్​ యుద్ధవిమానాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలని రాహుల్​ డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details