వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో కురిసిన చిన్న వర్షానికే రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అంబేడ్కర్ కూడలి నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే రహదారి పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల మురుగునీరు రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు నిలిచిపోవటం వల్ల గుమ్మాల ముందుకు మురుగు చేరి పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్ మండలాలకు వెళ్లడానికి ఈ రహదారే ఏకైక మార్గం కాగా... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారుల మరమ్మత్తులతో పాటు డ్రైనేజీ వ్యవస్థను బాగుచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
చినుకు పడితే చాలు చెరువులే ఈ రోడ్లు...! - ROADS WILL CHANGE AS LAKES FOR EVEN SMALL RAIN ALSO
వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో సాయంత్రం సమయంలో వర్షం కురిసింది. చిన్న పాటి జల్లుకే రోడ్లన్నీ చెరవుల్లా మారాయి. వర్షపు నీటితో కలిసి డ్రైనేజీ నీళ్లు రహదారులపైకి చేరి దర్గంధాన్ని వెదజల్లుతూంటే గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ROADS WILL CHANGE AS LAKES FOR EVEN SMALL RAIN ALSO