పేద ప్రజల తరఫున మాట్లాడానికి ప్రతిపక్షాలు ఉండాల్సిన అవసరం ఉందని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గొంతుకకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ దేశానికి ఎంతో సేవలను అందించారని... ఇప్పుడు ఆమె మనవడిని గెలిపించి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక... కనీస ఆదాయ పథకం కింద నెలకు 6వేలు అందిస్తామని హామీనిచ్చారు.
ప్రశ్నించే గొంతుకకు అండగా ఉందాం - revanth reddy election campaign
పార్లమెంటు ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న వేళ... అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు.
ప్రశ్నించే గొంతుకకు అండగా ఉందాం