నేపాల్లో కుండపోత వర్షం, పెను గాలుల కారణంగా 27 మృతి చెందారు. 400 మందికి గాయపడ్డట్లు ప్రధాని కేపీ శర్మ ఓలి ట్విట్టర్లో ప్రకటించారు.
తుపాను ధాటికి బారా జిల్లాలోని చాలా గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. కాఠ్మాండూకు 128 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది.
ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సైన్యాన్ని రంగంలోకి దింపింది.