సైబర్‌క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరైన టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మొదటి రోజు విచారణ ముగిసింది. ఐదు గంటలపాటు రవిప్రకాశ్‌ను ప్రశ్నించారు సైబర్ క్రైం పోలీసులు. తనను అన్యాయంగా మూడు కేసుల్లో ఇరికించినట్లు రవిప్రకాశ్ ఆరోపించారు. మాఫియా శక్తులు కావాలనే తనపై కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికి రవిప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌కు నోటీసులిచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మాఫియా నన్ను వేధింపులకు గురిచేస్తోంది... - మాఫియా నన్ను వేధింపులకు గురిచేస్తోంది...
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో మొదటి రోజు విచారణ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన విచారణకు సంధించిన పలు కీలక ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు అదికారులు వెల్లడించారు.
ముగిసిన మొదటిరోజు విచారణ