సికింద్రాబాద్లో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే ఫైల్ బస్టాండ్ నుంచి చిలకలగూడ వైపు వెళ్తున్న తాజ్ హుస్సేన్ అనే వ్యక్తిపై లారీ దూసుకెళ్లడం వల్ల తన శరీరం మూడు ముక్కలైంది. చిలకలగూడ స్థానికుడైన మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా.. ఎలిఫెంటా బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగారు.
రోడ్డు ప్రమాదంలో మూడు ముక్కలైన శరీరం - RAOD ACCIDENT
సికింద్రాబాద్ ఎలిఫెంటా బ్రిడ్జి వద్ద ఇవాళ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాజ్ హుస్సేన్ అనే వ్యక్తిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనతో అతని శరీరం మూడు ముక్కలైంది.
రోడ్డు ప్రమాదంలో మూడు ముక్కలైన శరీరం