ఏప్రిల్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం నాగర్ కర్నూల్ పరిధిలోని వనపర్తిలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
1 నుంచి తెలంగాణలో రాహుల్ సుడిగాలి పర్యటనలు - rahul gandhi
నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేతలంతా ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జాతీయ నేతలతో బహిరంగ సభలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి రాహుల్ షెడ్యూలు ఖరారు చేసింది.
rahul
సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, మల్లికార్జున ఖర్గేలతోపాటు పలువురు ముఖ్యనేతల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ త్వరలో ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Last Updated : Mar 28, 2019, 7:39 AM IST