తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కొన్ని తప్పులే మ్యాచ్​ని దూరం చేశాయి' - ముంబయి ఇండియన్స్

బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో ఓడిపోయింది చెన్నై.  జట్టు సభ్యులు చేసిన చిన్న చిన్న తప్పులే ఓటమికి కారణమయ్యాయని కెప్టెన్ ధోని చెప్పాడు.

ఫీల్డర్ల పొరపాట్లే మ్యాచ్​ను దూరం చేశాయన్న చెన్నై కెప్టెన్ ధోని

By

Published : Apr 4, 2019, 12:53 PM IST

ఐపీఎల్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నైసూపర్​కింగ్స్​కు బ్రేక్ పడింది. బుధవారం ముంబయితో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్​ అనంతరం చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.

10-12 ఓవర్ల వరకు ప్రత్యర్థిని కట్టడి చేశాం. డెత్ ఓవర్లలో మా బౌలర్లు తేలిపోయారు. కొన్ని క్యాచ్​లు వదిలేయడం, ఫీల్డింగ్​లో లోపాలు గెలుపు అవకాశాల్ని దెబ్బతీశాయి -ధోని, సీఎస్​కే కెప్టెన్

చివర్లో వచ్చిన ముంబయి బ్యాట్స్​మెన్ హార్దిక్, పొలార్డ్ వీరవిహారం చేశారు. చివరి 2 ఓవర్లలో 45 పరుగులు చేసి.. జట్టు 170 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

జట్టు సభ్యుల్ని గాయాలు బాధిస్తున్నాయని ధోని తెలిపాడు.

'బ్రావోను గాయం వేధిస్తోంది. ఎంగిడి ఇప్పటికే సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు. రానున్న మ్యాచ్​ల్లో సరైన కాంబినేషన్లతో ఆడి విజయం సాధిస్తాం' -ధోని, చెన్నై కెప్టెన్

శనివారం సొంతగడ్డపై జరిగే తర్వాతి మ్యాచ్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details