తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉగ్రనేతకు చైనా అండ - జెమ్

జైషే మహ్మద్​(జెమ్​) సంస్థ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్​ చేసిన విజ్ఞప్తిని మరోమారు చైనా తిరస్కరించింది.

ఉగ్రనేతకు చైనా అండ

By

Published : Feb 15, 2019, 5:45 PM IST

పుల్వామా ఉగ్రదాడిపై చైనా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కానీ ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్థాన్​ ఆధారిత తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత వినతిని మాత్రం మరోమారు తోసిపుచ్చింది.

1267 భద్రతా మండలి​ కమిటీ ద్వారా అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్​, అమెరికా, యూకే, ఫ్రాన్స్​ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం కలిగిన సభ్యుల్లో చైనా ఒకటి. అలాగే పాకిస్థాన్​తో మంచి సంబంధం కలిగి ఉంది. భారత డిమాండ్​ను నేరుగా తిరస్కరించకుండా... దొడ్డిదారి అనుసరించింది చైనా. జైషే మహ్మద్​ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఉందంటూ అజర్​పై చర్యల ప్రతిపాదనను తోసిపుచ్చింది.

"తీవ్రవాద దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఉగ్రవాద సంస్థల జాబితాపై 1267 భద్రతా మండలి​ కమిటీలో తీవ్రవాద సంస్థలపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. జెమ్​ తీవ్రవాద ఆంక్షల జాబితాలో ఉంది. నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పద్ధతిలో ఆంక్షలను చైనా కొనసాగిస్తుంది. " - జెంగ్​ షుయాంగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ అజర్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తిస్తే ప్రంపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేయటంపై నిషేధం ఉంటుంది. అతని ఆస్తులను స్తంభింపజేస్తారు.

ABOUT THE AUTHOR

...view details