తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పెళ్లి కంటే 'పబ్​జీ' యే ముఖ్యం.. ! - video

సాధారణంగా వివాహంలో అందరి దృష్టి పెళ్లికొడుకుపై ఉంటుంది. కానీ ఓ పెళ్లిలో వరుడి దృష్టి మాత్రం పబ్​జీపై ఉంది. పాపం.. వధువు మాత్రం అతడి ఫోన్​కేసి చూస్తుండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

పబ్​ జీ

By

Published : Apr 30, 2019, 8:48 PM IST

పబ్​జీ.. ఈ ఆటంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. చాలామంది తిండి, నిద్ర మానేసి మరీ ఈ గేమ్​ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు! తాజాగా ఓ పెళ్లిలో వరుడు పబ్​జీ ఆడుతూ పక్కనున్న వధువును కూడా పట్టించుకోలేదు. ఆమె అతడి సెల్​ఫోన్​​ చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

పెళ్లికొడుకు ఎంత ఏకాగ్రతతో పబ్​జీ ఆడుతున్నాడంటే.. వివాహానికి వచ్చిన అతిథి గిఫ్ట్​ ఇస్తున్నా.. అతడి బహుమానాన్ని తిరస్కరిస్తూ నెట్టేశాడు.

నెటిజన్లు ఈ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పబ్​జీని దేశంలో చాలా చోట్ల నిషేధించారు. గుజరాత్ రాజ్​కోట్​లో పబ్​జీ ఆడినందుకు పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఆటపై నేపాల్​ కూడా నిషేధం విధించింది.

ABOUT THE AUTHOR

...view details