పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగుప్పలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ యువతి గొంతుకోసి చంపారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆధార్ కార్డు ఆధారంగా నిందితుడు హైదరాబాద్లోని ఖైరతాబాద్ వాసిగా గుర్తించారు. పరారైన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మృతురాలు మహతి... రాజోలు శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినిగా గుర్తించారు. ఆమె ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసింది. మహతి స్వస్థలం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉండటంతో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటుంది.