ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థిసంఘాల నాయకులు, అఖిల పక్షం నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని విద్యార్థిసంఘం నాయకులు అన్నారు.
'న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు' - inter board
ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని అఖిలపక్షం నేతలు, విద్యార్థిసంఘాల నాయకులు ముట్టడించేందుకు యత్నించారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
protest at inter board