మేడ్చల్ జిల్లా బాచుపల్లి పురపాలక సంస్థ పరిధిలోని పత్తికుంట చెరువును ఆక్రమణదారుల నుంచి కాపాడాలని చుట్టుపక్కల స్థానికులు కోరుతున్నారు. చెరువు కింది భాగంలో నివాసముంటున్న ఆరు కాలనీలు నీటి ముంపునకు గురికాకుండా ఉండాలంటే చెరువు స్వరూపం కోల్పోకుండా ఉండాలన్నారు. నిండుకుండలా నీటితో ఉండే చెరువును కళావిహీనంగా తయారు చేశారని ఆరోపించారు. కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెరువును కాపాడాలని స్థానిక నాయకులకు వినతిపత్రం సమర్పించారు.
'ఆక్రమణదారులనుంచి మా చెరువును కాపాడండి'
బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్ సమీపంలోని పత్తికుంట చెరువులో ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు నిరసనకు దిగారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఆక్రమణలో పత్తికుంట చెరువు.. ఆవేదనలో స్థానికులు