తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా 14 వేలమందికి సాయం

సీసీసీ తరఫున 14 వేల మంది సినీ కార్మికులకు సాయం చేశామని చెప్పిన సి.కల్యాణ్.. త్వరలో తుదివిడతగా నిత్యావసరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా 14 వేలమందికి సాయం
సికల్యాణ్ చిరంజీవి

By

Published : May 5, 2020, 3:31 PM IST

Updated : May 5, 2020, 4:19 PM IST

దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికుల కోసం ఎంతో కృషిచేస్తున్నారని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా 14 వేల మంది కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే అవసరం లేనివారు వచ్చి, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడం బాధ కలిగించిందన్నారు. సరకుల కోసం కూడబెట్టిన నిధులు నిండుకున్నా, చిరంజీవి వ్యక్తిగతంగా సహాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. శాఖల వారీగా కార్మికుల వివరాలు సేకరించి తుది విడుతగా సహాయం త్వరలో అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ విరాళాల గురించి మాట్లాడుతున్న సి.కల్యాణ్
Last Updated : May 5, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details