ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా పలు కీలక ఉద్దీపనలు ప్రకటించిన అనంతరం.. గోవా పనాజీలో జీఎస్టీ మండలి సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది వస్తు సేవల పన్ను కౌన్సిల్.
జీఎస్టీ భేటీ: వాహన రంగానికి ఊరట లభించేనా..? - కేంద్ర మంత్రి
12:03 September 20
గోవాలో జీఎస్టీ సమావేశం ప్రారంభం
11:09 September 20
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన చర్యలు
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కార్పొరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు జీఎస్టీ సమావేశానికి ముందు మీడియా సమావేశంలో ప్రకటించారు. దేశీయ కంపెనీలకు అన్ని సెస్, సర్‌చార్జీలతో సహా కార్పొరేట్ పన్నును ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించారు. ఈ కొత్త పన్ను రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా వచ్చే రాబడి ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయల రాబడి తగ్గుతుందని నిర్మలా అంచనా వేశారు.
10:47 September 20
జీఎస్టీ భేటీకి ముందు నిర్మలా మీడియా సమావేశం
గోవాలో జీఎస్టీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పలు కీలక ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కొత్త దేశీయ తయారీ సంస్థలకూ కార్పొరేట్ పన్ను ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన తీసుకొస్తామని వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా ఈ నిబంధన తీసుకొస్తామన్నారు.