తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రేపు జమ్ముకశ్మీర్​కి కేంద్ర హోంమంత్రి

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్​ గవర్నర్​, భద్రతా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

Breaking News

By

Published : Feb 14, 2019, 9:31 PM IST

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు గవర్నర్ సత్యపాల్ మాలిక్​, సైనికు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. రేపటి బిహార్ పర్యటన రద్దు చేసుకుని, జమ్ముకశ్మీర్​కు ఆయన వెళ్లనున్నారు.

సీఆర్పీఎఫ్ డైరెక్టర్ ఆర్.ఆర్.భట్నాగర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌరభ్​లతో సమీక్షించి, పరిస్థితులపై ఆరా తీస్తున్నారు రాజ్​నాథ్​.

"పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘటన చాలా బాధాకరం. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి సైనికుడి త్యాగాన్ని ప్రశంసిస్తున్నాను. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా- కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్ ట్వీట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details