తెలంగాణ

telangana

ETV Bharat / briefs

స్థానిక ఎన్నికల్లో కేసీఆర్​కు బుద్ధిచెప్పండి: పొన్నాల - local polls

ప్రజా సమస్యలను గాలికొదిలి.. విహారయాత్రలు చేస్తున్న కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని కాంగ్రెస్​ సీనియర్​నేత పొన్నాల లక్ష్మయ్య కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

స్థానిక ఎన్నికల్లో కేసీఆర్​కు బుద్ధిచెప్పండి: పొన్నాల

By

Published : May 8, 2019, 4:40 PM IST

స్థానిక ఎన్నికల్లో కేసీఆర్​కు బుద్ధిచెప్పండి: పొన్నాల

నాలుగు నెలలు గడిచినా సర్పంచ్​లకు చెక్​పవర్​ ఇవ్వకుండా కేసీఆర్​ పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. గ్రామాలకు నేరుగా నిధులను కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో కేటాయించినట్లు తెలిపారు. అంబేడ్కర్​ విగ్రహాన్ని అవమానించి, ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్​కు గుణపాఠం చెప్పాలన్నారు. అధికారం, పార్టీ ఫిరాయింపులు తప్ప కేసీఆర్​కు మరో ధ్యాస లేదన్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి విహారయాత్రలకు పోతున్న ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details