పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్లో విద్యార్థులు తమకు నచ్చిన కేంద్రంలో వీలైన సమయంలో ధ్రువపత్రాలు పరిశీలన చేసుకునేలా కొత్త విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు ఈనెల 14 నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, స్లాట్ బుకింగ్ తదితర ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
'14 నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రక్రియ' - councelling
పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో విద్యార్థులు తమకు అనువైన సమయంలో.. నచ్చిన కేంద్రంలో ధ్రువ పత్రాలను పరిశీలన చేసుకోవచ్చని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈనెల 15 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ కోరారు. 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని.. 22న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 23 నుంచి 25 వరకు ఆన్లైన్ బోధన రుసుము చెల్లించి.. కళాశాలలకు రిపోర్టు చేయాలని వివరించారు. జూన్ 1న కళాశాలల్లో చేరాలని.. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నవీన్ మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో 12వేల సీట్లు.. ప్రైవేట్లో సుమారు 30వేల సీట్లకు ఏఐసీటీఐ అనుమతినిచ్చిందన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 77.63 శాతం పోలింగ్ నమోదు