తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎన్నికల కోసం పోలీసు వ్యవస్థ పకడ్బందీ ఏర్పాట్లు! - election

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలింగ్​ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత

By

Published : Mar 29, 2019, 9:37 AM IST

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత
ఏప్రిల్​ 11న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల కోసం అధికారులతో సమన్వయంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాపంగా ఉన్న 34,667 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా​ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

145 కంపెనీల బలగాలతో భద్రత...

28,273 పోలింగ్ కేంద్రాలను సాధారణమైనవి, 6394 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 48వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు.... కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నాయి. 145 కంపెనీల బలగాలను రాష్ట్రానికి కేటాయించారు.

అక్రమ మద్యం, నగదుపై నిఘా...

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ప్రత్యేకంగా 405 ఫ్లయింగ్​ స్వ్కాడ్, 395 నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 55లక్షల రూపాయల విలువ చేసే మద్యం, 2కోట్ల 77లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు పట్టుకున్నారు. 8500 లైసెన్స్​డ్​ ఆయుధాలు డిపాజిట్ చేసుకున్నారు. 18వేలకు పైగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనుభవం ప్రస్తుతం ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు.

సిబ్బందికి ఆదేశాలు...

ఇప్పటికే సెలవుల్లో ఉన్న సిబ్బందిని ఏప్రిల్​ 1 లోగా విధులకు హాజరుకావాలంటూ అధికారులు అదేశించారు. లేకుంటే... విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!

ABOUT THE AUTHOR

...view details