తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పోలీసు విధుల్లో వికసించిన మానవత్వం - రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్

పోలీసు విధుల్లో మానవత్వం వికసించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ ప్రాణాలు కాపాడి సభ్య సమాజానికి ఆదర్శంగా నిలిచారు పోలీసులు.

వికసించిన మానవత్వం

By

Published : May 27, 2019, 4:50 PM IST

Updated : May 27, 2019, 6:47 PM IST

నేర నియంత్రణలో ఎప్పుడూ.. తీరిక లేకుండా ఉండే పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పద్మారావునగర్ కాలనీలో నివాసం ఉంటున్న మురళీ, ప్రియాంక దంపతులు కుటుంబ కలహాల కారణంగా గొడవపడి ఇద్దరూ వేర్వేరు గదుల్లోఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఉరి తాడుకు వేలాడుతున్న వారిని కిందకు దింపి కాపాడే ప్రయత్నం చేశారు. భర్త మురళీ అప్పటికే ప్రాణాలు విడవగా... కొన ఊపిరితో ఉన్న ప్రియాంకను ఓ పోలీసు చేతులతో మోసుకెళ్ళి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడారు. ప్రియాంక ప్రాణాలు కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ మహిపాల్, హోంగార్డు నవీన్‌ను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తోపాటు స్థానికులు అభినందించారు.

విధుల్లో వికసించిన మానవత్వం
Last Updated : May 27, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details