లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 20 కోట్ల 38 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2.43 లక్షల లీటర్ల మద్యం పట్టుబడగా... దీని విలువ సుమారు రూ. 3.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ. 2.48 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ. 26 లక్షల విలువైన బంగారు వెండి అభరణాలను అధికారులు సీజ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు - నగదు
రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ.20.38 కోట్ల నగదు, 2.43 లక్షల లీటర్ల మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ముమ్మర తనిఖీలు