దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్‌కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 15న దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ట్రైన్-18 రైలుకు ఇటీవలే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు.