ప్రతిపక్షాల మహాకూటమిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. విపత్తుకు దారితీసే కూటమిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆదరించబోరని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ నేతలు, పార్టీలతో ఏర్పడిన ప్రతిపక్షాల మహాకూటమి రాజకీయ అస్థిరత్వానికి మాత్రమే హామీ ఇస్తుందని తన అజెండా-2019 బ్లాగ్లో పేర్కొన్నారు.
" చరిత్రను పరిశీలించి, భారతీయులు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆరు నెలలు ఉండే ప్రభుత్వాన్ని ఎంచుకుందామా? లేదా ఐదేళ్ల ప్రభుత్వాన్నా అని?... నిరూపించుకున్న, సత్తాగల నాయకుడినా లేకా గందరగోళ గుంపులోని నాయకుడినా.. ఎవరిని ఎన్నుకోవాలా అని?"- జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
" ప్రజలు ఎన్నుకునేది వృద్ధిని పెంచే, అభివృద్ధి చేసే, పేదరిక నిర్మూలన చేసే ప్రభుత్వాన్నా... లేకా సొంత ప్రగతిని చూసుకునే వారినా...? దేశ ప్రజలు సరైన ఎంపికనే ఎంచుకుంటారని నేను నమ్ముతున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించాలనే లక్ష్యంతోనే మహా కూటమి ఏర్పాటైంది. అది విపత్తుకు దారి. అది కిందిస్థాయి పోటీ. "- జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి
ప్రధాని అభ్యర్థిపై పోరు