ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. పేదలకు లబ్ధి చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథాకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు మోదీ. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగానే దేశంలో పేదరికం తగ్గుతోందని తెలిపారు
విపక్షాలన్నీ ఏకమై ఏర్పాటైన మహాకూటమితో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని
కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల పై విసుర్లు
దాదాపు గాంధీ కుటుంబ సభ్యులందరీపై కేసులున్నాయి, కొందరు బెయిలుపై ఉంటే మరికొందరు ముందస్తు బెయిల్ తీసుకున్నారని మోదీ ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ "ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని మొదట నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతించొద్దని రెండో నిర్ణయం తీసుకుంది. మహాకూటమితో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. దేశాన్ని భ్రష్టు పట్టించేందుకే మహాకూటమి ఏర్పాటైంది. ఎట్టి పరిస్థితిల్లోనూ వారికి అవకాశం ఇవ్వొద్దు. "
- నరేంద్ర మోదీ