తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'కోమటిరెడ్డి వ్యాఖ్యలకు, వివరణకు పొంతనలేదు' - కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలకు, ఇచ్చిన వివరణకు పొంతన లేదని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్​ కోదండరెడ్డి వెల్లడించారు. ఆయన వివరణను ఏఐసీసీకి పంపామన్నారు.

'రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలకు, వివరణకు పొంతనలేదు'

By

Published : Jun 27, 2019, 5:20 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి నుంచి షోకాజ్​ నోటీస్​కు వివరణ వచ్చిందని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్​ కోదండరెడ్డి తెలిపారు. రాజగోపాల్​రెడ్డి ఏఐసీసీ సభ్యుడు కావడం వల్ల వారికి సైతం పంపినట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు వివరణకు పొంతనలేదన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వివరణ ఇస్తే.. స్వాగతించేవాళ్లమని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీని తూలనాడి, ఇతర పార్టీలను నెత్తిన పెట్టుకోవడం సరికాదన్నారు.

'రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలకు, వివరణకు పొంతనలేదు'

ABOUT THE AUTHOR

...view details