తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అందుకే డేటా కేసు... - డేటా

హామీల అమలులో విఫలమై.. పార్లమెంట్​ ఎన్నికలను ఎదుర్కోలేక సరికొత్త కుట్రలకు కేసీఆర్​ తెరతీశారని తెతెదేపా అధ్యక్షుడు రమణ విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు.

అందుకే డేటా కేసు...

By

Published : Mar 8, 2019, 3:32 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకనే డేటా చోరీ కేసును తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్​, మోదీలతో కేసీఆర్​ కుమ్మక్కైయ్యారని... శాసన సభ ఎన్నికల్లో తెరాస అనుసరించిన కుట్రలు ఆంధ్రలోనూ అమలు చేసి జగన్​ను గద్దెనెక్కించడానికి కేసీఆర్​ యత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూడలేకనే సరికొత్త కుట్రలకు కేసీఆర్​ తెరతీశారని ఎద్దేవా చేశారు.

అందుకే డేటా కేసు...

ఇవీ చూడండి:కేసీఆర్​కు కేటీఆర్​ సవాల్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details