తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రతీకారమా.. శాంతి మంత్రమా?

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

ప్రతీకారమా.. శాంతి మంత్రమా?

By

Published : Feb 15, 2019, 9:52 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఘటన 2001లో జరిగిన ఉగ్రదాడిని తలపిస్తోంది. అప్పుడు కశ్మీర్​ శాసనసభ వద్ద ఆత్మాహుతి దాడి జరిపిన ముష్కరులు ఇప్పుడూ దాదాపు అదే పునరావృతం చేశారు.
రెండుసార్లు దాడికి పాల్పడింది జైష్ ఏ మహమ్మద్​ ఉగ్రవాద సంస్థనే. కానీ అప్పుడు ఆత్మాహుతి దాడి జరిపింది పాకిస్థాన్​ వ్యక్తి కాగా, పుల్వామా ఘటనలో బాంబర్​ భారత పౌరుడు కావటం గమనించాల్సిన అంశం.

ఈ దాడి అనంతరం కేంద్రప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి.

  • 2016, సెప్టెంబర్​ 29 మాదిరి మెరుపు దాడులు నిర్వహించడం
  • దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవటం

ప్రస్తుతం పాక్​తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా దౌత్య పరమైన చర్చలు ఫలించే అవకాశం కన్పించట్లేదు. ఇలా కాని పక్షంలో మరోసారి మెరుపు దాడులకు అవకాశముందేమో చూడాలి.

దౌత్యపరమైన చర్చల్లో భారత్​కు కొన్ని దేశాల మద్దతున్నా, ఐరాసలో చైనాకున్న వీటో అధికారంతో ఏమవుతుందో చూడాలి. చైనా పాక్​కు ప్రియమైన మిత్రదేశం. ఈ నేపథ్యంలో భారత్​ లక్షిత దాడులవైపే మొగ్గుచూపుతుందో చూడాలి.

2016, సెప్టెంబర్​ 29న ఉరీ వద్ద మెరుపుదాడులు నిర్వహించి పాక్​ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకుంది భారత్​. ఈ ఘటనపై ప్రశంసలకు తోడు, విమర్శల్నీ ఎదుర్కొంది మోదీ ప్రభుత్వం. 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details