తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఒళ్లంతా వెంట్రుకలు... బాలుడికి వింత రుగ్మత - HAIR

మధ్యప్రదేశ్​లోని నంద్​లేతాలో 13 సంవత్సరాల బాలుడు లలిత్​ పటేదార్​ వింత రుగ్మతతో బాధపడుతున్నాడు. అతడి ఒళ్లంతా వెంట్రుకలు పెరిగాయి.

ఒళ్లంతా వెంట్రుకలు... బాలుడికి వింత రుగ్మత

By

Published : Feb 13, 2019, 10:32 AM IST

మధ్యప్రదేశ్​లోని నంద్​లేతాలో 13 సంవత్సరాల బాలుడు లలిత్​ పటేదార్​ ఓ వింత రుగ్మతతో బాధపడుతున్నాడు. అతడి ముఖం సహా ఒళ్లంతా వెంట్రుకలు పెరిగిపోయాయి. ఈ సమస్యతో తినడానికి, తాగడానికి చివరికి శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్నాడు లలిత్​ పటేదార్​.

లలిత్​ పరిస్థితి ఇలా ఉంటే కొందరు గ్రామస్థులు తమ ప్రవర్తనతో మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. పిల్లలు ఇతన్ని చూసి భయపడుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు. వీటన్నింటికి అలవాటు పడిపోయాడు లలిత్​. లక్ష మందిలో ఒకరికి ఇలాంటి రుగ్మత ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ రుగ్మత లలిత్​ సాధారణ జీవితానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించలేకపోయింది. పాఠశాలలో చురుకైన విద్యార్థుల్లో లలిత్​ ఒకరు. భవిష్యత్​లో పోలీసు అధికారి కావడమే లక్ష్యమంటున్నాడు. అవకాశమొస్తే ప్రధానిని కలుస్తానని అంటున్నాడు లలిత్.

ABOUT THE AUTHOR

...view details