తెలంగాణ అన్నవరమైన గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలోని ఘాట్ రోడ్డు నిర్మాణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కమీషన్లకు ఆశపడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పుష్కరాలకు ముందు పూర్తి చేయాల్సిన పనులు నాలుగేళ్లయినా ముందుకు కొనసాగడం లేదు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం 3 కోట్ల 10 లక్షల నిధులు మంజూరు చేసింది. కొండపైకి పటిష్టంగా ఘాట్ నిర్మించాల్సిన అధికారులు నిధులను వృథా చేశారు.
'పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు'
తెలంగాణలో వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, చత్తీస్గడ్ ఒరిస్సా, రాష్ట్రాల నుంచి సైతం భక్తులు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వ్రతాలు ఆచరిస్తారు. ప్రతి పౌర్ణమిలో ఈ దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది.
స్వామి వారి దర్శనానికి 208 మెట్లు ఎక్కాల్సిందే
ఆలయానికి ఒక కోటి 40 లక్షల ఆదాయం వస్తుంది. స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రస్తుతం భక్తులు 208 మెట్లు ఎక్కుతారు. ఈ మెట్లపై నుంచి వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే వీలు లేక గుట్ట కింద ఉండి పోతున్నామని భక్తులు వాపోతున్నారు. ఘాట్ రోడ్డుకు 380 మీటర్ల పొడవు రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
బైట్: అనిల్,గూడెం
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రమా సత్యనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
'గూడెం ఘాట్ రోడ్డు పనుల్లో అధికారుల అలసత్వం' - SRI RAMA SATYANARAYANA SWAMY
తెలంగాణ అన్నవరంగా పేరు గడించిన గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా పసిద్ధి గాంచింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం.. గూడెం గుట్టలో ప్రణాళిక లేని పనులతో కొండపైకి వెళ్లే దారిలో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
అర్ధాంతరంగా నిలిచిన ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు
ఇవీ చూడండి : ఎన్నికల ప్రచారం తీర్థయాత్రలా అనిపించింది: మోదీ