విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్ చేసిన సవరణలపై... చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం పట్ల కేంద్రం ఘాటుగా స్పందించింది. భారత ఎఫ్డీఐ విధానంపై ఏ దేశం కూడా అతిగా చింతించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
'భారత ఎఫ్డీఐ విధానంతో ఆందోళన అనవసరం' - free trade
భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం పట్ల ఏ దేశమూ ఆందోళన చెందవద్దని పేర్కొంది కేంద్రం. ఇటీవల భారత్ చేసిన మార్పులపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలా స్పందించింది ప్రభుత్వం.
'భారత ఎఫ్డీఐ విధానంతో ఆందోళన అనవసరం'
ఏ సరిహద్దు దేశం కూడా ముందస్తు అనుమతులు లేకుండా దేశంలోకి పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదని ఎఫ్డీఐ విధానంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత్‌లోని స్థానిక సంస్థలను చేజిక్కించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోగా.. దీనిపై చైనా విమర్శలు గుప్పించింది. స్వేచ్ఛా వాణిజ్యంపై వివక్షత చూపిస్తున్నట్లుగా ఆరోపించింది.