తెలంగాణ

telangana

ETV Bharat / briefs

విభిన్న చిత్రాల కథానాయకుడు 'నితిన్'

టీనేజ్ వయసులో సినీ ఇండస్ట్రీకి వచ్చి.. విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో నితిన్. నేడు ఈ యువ హీరో పుట్టిన రోజు.

విభిన్న చిత్రాల కథానాయకుడు 'నితిన్'

By

Published : Mar 30, 2019, 6:15 AM IST

నితిన్‌ అసలు పేరు నితిన్‌ రెడ్డి. 1983 మార్చి 30న హైదరాబాద్‌లో సుధాకర్‌ రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు జన్మించాడు. తండ్రి ఫిల్మ్‌ డిస్టిబ్యూటర్‌.

తొలిచిత్రం ‘జయం’తోనే విజయాన్నందుకొని, ‘దిల్‌’ సినిమాతో మాస్‌ పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించాడు. ‘శ్రీ ఆంజనేయం’లో భక్తునిగా.. ‘సై’లో కాలేజీ కుర్రాడిగా విభిన్న పాత్రలతో హిట్‌లు కొట్టినప్పటికీ తర్వాత కొత్తదనం లేని మూస కథలను ఎంచుకుంటూ వరుస అపజయాలు కొని తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో 2005 నుంచి 2011వరకు వరుస ప్లాప్‌లతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్త తరహా ప్రేమకథ ‘ఇష్క్‌’ను ఎంచుకొని హిట్టుకొట్టాడు నితిన్‌. ఆ తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హర్ట్‌ఎటాక్‌’, ‘చిన్నదాన నీకోసం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ విజయాల బాటపట్టాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘అఆ’తో స్టార్‌హీరో స్థాయికి చేరుకున్నాడు.

ఒకప్పుడు వరుస పరాజయాలతో డీలాపడిన నితిన్‌.. పడిలేచిన కెరటంలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న "భీష్మ", చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలోనూ, కృష్ణచైతన్య తెరకెక్కించే మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details