తెలంగాణ

telangana

ETV Bharat / briefs

లండన్​ కోర్టులో నీరవ్ బెయిల్ అభ్యర్థన - nirav

లండన్​లో పోలీసుల నిర్బంధంలో ఉన్న నీరవ్ మోదీని కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టనున్నారు. నీరవ్​ రెండో బెయిల్ దరఖాస్తుపై ఆ రోజే న్యాయస్థానం వాదనలు విననుంది.

లండన్​ కోర్టులో నీరవ్ బెయిల్ అభ్యర్థన

By

Published : Mar 26, 2019, 11:58 PM IST

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రెండో బెయిల్ దరఖాస్తుపై లండన్ వెస్ట్​మినిస్టర్​ మెజిస్ట్రేట్​ న్యాయస్థానం శుక్రవారం వాదనలు విననుంది. పోలీసుల నిర్బంధంలో ఉన్న నీరవ్​ను బెయిల్ విచారణ సమయంలో కోర్టులో హాజరుపరుస్తారు.

గతవారం సెంట్రల్ లండన్ బ్యాంకులో ఖాతా తెరిచేందుకు ప్రయత్నించిన నీరవ్​ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటికే నీరవ్​ మొదటి బెయిల్ అభ్యర్థను న్యాయస్థానం తిరస్కరించింది.

మొదటి అభ్యర్థన విచారణ సమయంలో నీరవ్​కు బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానంలో వాదనలు వినిపించారు భారత్ తరఫు న్యాయవాది. నీరవ్​పై రూ.14వేల కోట్ల మేర ఆర్థిక నేరాభియోగాలున్నాయని తెలిపారు.

గత డిసెంబరులో కింగ్​ఫిషర్​ అధినేత విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించాలని తీర్పునిచ్చిన న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్​నాట్​... శుక్రవారం నీరవ్​ రెండో బెయిల్​ పిటిషన్ వాదనలను విననున్నారు.

అర్బుత్​నాట్​ తీర్పుపై లండన్ హైకోర్టును ఆశ్రయించారు మాల్యా. ఈ కేసు పెండింగ్​లో ఉన్న కారణంగా మాల్యాపై న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు.

ఇదీ చూడండి:నోట్ల రద్దు సమయంలో దోపిడీపై కాంగ్రెస్ వీడియో

ABOUT THE AUTHOR

...view details