పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. లండన్లోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివాసముంటున్న మోదీని స్కాట్లాండ్ యార్డు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ కోసం నీరవ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది వెస్ట్ మినిష్టర్ కోర్టు. మార్చ్ 29 వరకు కస్టడీలోనే ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.
"నీరవ్ దీపక్ మోదీని భారత అధికారుల తరపున హోల్బోర్న్లో మంగళవారం అరెస్టు చేశాం. మోదీని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ ముందు లండన్ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెడతాం."
-మెట్రోపాలిటన్ పోలీసులు.
రెండు రోజల క్రితమే మనీలాండరింగ్ కేసులో మోదీపై లండన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.