తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాళేశ్వరం పనులకు మరో  రూ.14 వేల కోట్లు - కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మధ్యమానేరు నుంచి మల్లన్న సాగర్​ రిజర్వాయర్​కు అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో దాదాపు రూ. 14 వేల కోట్ల మేర టెండర్​ ప్రక్రియను చేపట్టనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు

By

Published : May 8, 2019, 8:08 AM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా దాదాపు రూ. 14 వేల కోట్ల పనులకు త్వరలోనే నీటి పారుదల శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటివరకు అంచనాలు రూపొందించిన అధికారులు... త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోనున్నారు. మధ్యమానేరు నుంచి మల్లన్న సాగర్​ రిజర్వాయర్​ వరకు ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని మళ్లించే పనులు పూర్తి కావచ్చాయి. మంత్రుల ఉపసంఘం సూచించిన మేరకు అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులు చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details