యువతకు మరింత దగ్గరయ్యేందుకు సిద్ధమైంది పబ్ జీ. గత 8 నెలలుగా టెస్టింగ్ దశలో ఉన్న పబ్ జీ లైట్ యాప్ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 80కి పైగా దేశాల్లో నేటి నుంచి పబ్ జీ లైట్ అందుబాటులో ఉండనున్నట్లు పబ్ జీ కార్పొరేషన్ వెల్లడించింది.
ఓపెన్ బీటా వెర్షన్లో గేమ్ కంటెంట్లో అదనపు మార్పులతో పాటు లైట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా గేమ్ మిషన్ను పూర్తి చేసేందుకు గేమర్లకు అవకాశం కలగనుంది.