నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతర్చెడ్ గ్రామంలో ఈరోజు పెళ్లి చేసుకున్న నూతన దంపతులు రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి రోజు ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని వరుడు కృష్ణా తెలిపారు. బతుకుదెరువు కోసం ముంబయిలో స్థిరపడిన వీరు వివాహం కోసం స్వగ్రామానికి వచ్చారు. ఇవాళ పరిషత్ ఎన్నికలు ఉండడం వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన నవ దంపతులు - costed vote
పెళ్లి చేసుకున్న నూతన దంపతులు తమ బాధ్యత విస్మరించలేదు. వివాహం అనంతరం రెండో విడత స్థానిక సమరంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెళ్లి రోజే ఓటు వేయడం ఆనందంగా ఉందని నవ దంపతులు తెలిపారు.
ఓటేసిన నవ దంపతులు