తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నాగార్జున, వెంకటేశ్.. నాగచైతన్య కోసం వస్తున్నారు - సమంత

హైదరాబాద్​లో జరిగే 'మజిలీ' ప్రీ రిలీజ్​ వేడుకకు హీరోలు నాగార్జున, వెంకటేశ్ హాజరుకానున్నారు. నాగచైతన్య, సమంత ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

మజిలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరు కానున్న నాగార్జున, వెంకటేశ్

By

Published : Mar 28, 2019, 6:00 AM IST

నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈనెల 31న సినిమా ప్రీ రిలీజ్​ వేడుకను హైదరాబాద్​లో నిర్వహించనున్నారు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే వెంకటేశ్​తో కలిసి 'వెంకీమామ'సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య.

సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రికెటర్​గా, మధ్య తరగతి భర్తగా..రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడు హీరో. గోపీసుందర్ చిత్రానికి సంగీతమందించాడు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

ఇప్పటికే విడుదలైన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చై-సామ్ పెళ్లయ్యాక నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details