తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నాలుగో రోజూ కోల్​కతా సీపీపై సీబీఐ ప్రశ్నల వర్షం - శారదా కుంభకోణం

వరుసగా నాలుగో రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​కుమార్​.

కమిషనర్​ రాజీవ్​కుమార్

By

Published : Feb 12, 2019, 7:06 PM IST

సీబీఐ షిల్లాంగ్​ కార్యాలయంలో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​కుమార్ విచారణ వరుసగా నాలుగో రోజు సాగింది. శారదా కుంభకోణం కేసులో సాక్ష్యాల అవకతవలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నిస్తోంది.

రాజీవ్​కుమార్​తో పాటు తృణమూల్​ కాంగ్రెస్​ మాజీ నేత కునాల్​ ఘోష్ ఆది, సోమవారాల్లో విచారణకు హాజరయ్యారు. ఆయన తిరిగి కోల్​కతాకు వెళ్లారు.

రాజీవ్​కుమార్​ను గత మూడు రోజుల్లో 24 గంటలకు పైగా ప్రశ్నించింది సీబీఐ. రోజ్​వ్యాలీ, శారదా ​ కుంభకోణాల విచారణలో సీబీఐకి సహకరించాలని రాజీవ్​కుమార్​ను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. షిల్లాంగ్​ను తటస్థ వేదికగా ఎంపిక చేసిన న్యాయస్థానం... రాజీవ్​కుమార్​ను అరెస్టు చేయకూడదని సీబీఐని ఆదేశించింది.

ఫిబ్రవరి 3న రాజీవ్​కుమార్​ను ప్రశ్నించటానికి ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను కోల్​​కతా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ.

ABOUT THE AUTHOR

...view details